Karthikeya 2 : ‘కార్తికేయ‌ 2’ – ఇంటెన్స్ లుక్‌‌తో నిఖిల్..

జూన్ 1న హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘కార్తికేయ 2’ నుంచి బర్త్‌డే పోస్టర్ విడుదల చేశారు..

Karthikeya 2 : ‘కార్తికేయ‌ 2’ – ఇంటెన్స్ లుక్‌‌తో నిఖిల్..

Nikhil Karthikeya 2 Movie First Look

Karthikeya 2: యూత్ ఐకాన్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న స‌మ‌యంలో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ అనే ప్ర‌ెస్టీజియస్ థ్రిల్ల‌ర్ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేస‌కుంది. ఎనిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి ప‌రిచ‌యం చేశారు డైరెక్టర్ చందూ మొండేటి. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా, అల‌రించేలా త‌న పెన్‌కి ప‌ని పెట్టే ద‌ర్శ‌కుడు చందూ మెుండేటి మ‌రోసారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో ‘కార్తికేయ‌ 2’ మూవీ చేస్తున్నారు.

క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో మంచి చిత్రాలు తీస్తున్నాయి క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌. ఈ రెండు నిర్మాణ సంస్థ‌ల మేకర్స్ విడివిడిగా ఎన్నో సూప‌ర్‌ హిట్స్ అందించారు. అలాగే క‌లిసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ అందించారు. ఇప్పుడు మ‌రోసారి నిఖిల్‌, చందూ మొండేటి క్రేజీ కాంబినేష‌న్‌లో ‘కార్తికేయ‌ 2’ సినిమాని నిర్మిస్తున్నారు.

Karthikeya 2

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. జూన్ 1న హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘కార్తికేయ 2’ నుంచి బర్త్‌డే పోస్టర్ విడుదల చేశారు. గ‌తంలో ‘కార్తికేయ 2’ కి సంబంధించిన కాన్సెప్ట్ మోష‌న్ పోస్టర్‌కి అనూహ్య స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో చాలా సీరియస్‌గా ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. Saviours Emerge in Crisis అంటూ ఈ పోస్టర్‌లో ఉన్న మేటర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ ముగ్ధ అనే పాత్రలో నటిస్తుంది. ఈమె పాత్ర చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు చందూ మొండేటి. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.