Karthikeya 2 : నితిన్‌తో పోటీ తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 మళ్ళీ వాయిదా

పలు సార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2 సినిమాని ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు కార్తికేయ 2 సినిమాని. ఆగస్టు 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా

Karthikeya 2 : నితిన్‌తో పోటీ తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 మళ్ళీ వాయిదా

Nikhil :  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. ఈ సారి సినిమా మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్.

పలు సార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2 సినిమాని ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు కార్తికేయ 2 సినిమాని. ఆగస్టు 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా రాబోతుంది. దీంతో కార్తికేయ 2 సినిమాని ఒక రోజుకి పోస్ట్ పోన్ చేశారు. ఆగస్ట్ 12 బదులు ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తున్నట్టు హీరో నిఖిల్ ప్రకటించారు.

Bindu Madhavi : వేసుకునే బట్టలని బట్టి రెస్పెక్ట్ ఇస్తాను అంటే.. అది నాకవసరంలేదు

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్ సినిమాని ఒక రోజుకి వాయిదా వేస్తున్నట్టు, టాలీవుడ్ లో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం, అన్ని సినిమాలకి కలెక్షన్స్ రావడం కోసమే ఒకరోజు లేట్ గా థియేటర్స్ కు వస్తున్నాము అని తెలిపాడు.