Bindu Madhavi : వేసుకునే బట్టలని బట్టి రెస్పెక్ట్ ఇస్తాను అంటే.. అది నాకవసరంలేదు

Bindu Madhavi : వేసుకునే బట్టలని బట్టి రెస్పెక్ట్ ఇస్తాను అంటే.. అది నాకవసరంలేదు

Bindu Madhavi :  ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్, రామరామ కృష్ణకృష్ణ.. లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన బిందు మాధవి ఆ తర్వాత తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపొయింది. ఇటీవల జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొంది బిందు మాధవి. అప్పట్నుంచి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ పెట్టింది. బిగ్ బాస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన బిందు మాధవి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది.

తాజాగా బిందు మాధవి ఓ ట్రెండీ డ్రెస్సులో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల కింద ఆ డ్రెస్ ఏంటి అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్‌ బిందు డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..”బిగ్‌బాస్‌ హౌజ్‌లో అందరూ శరీరం కనిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే, మీరు మాత్రం మంచి బట్టలు వేసుకున్నారు. దీంతో మీ మీద రెస్పాక్ట్‌ పెరిగింది. కానీ ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేయడంతో అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే హౌజ్‌లో అలా ఉందని అర్ధమవుతుంది” అంటూ విమర్శిస్తూ కామెంట్ చేసింది.

Masooda Teaser : భయపెడుతున్న ‘మాసూద’ టీజర్.. నాని చేతుల మీదుగా రిలీజ్..

అయితే దీనికి బిందుమాధవి గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఆ నెటిజన్ చేసిన కామెంట్ కి రిప్లై ఇస్తూ.. ”మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే, అలాంటి గౌరవం నాకు వద్దు” అని కామెంట్ చేసింది బిందు మాధవి. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.