Karthikeya 2 Two Days Collections: కార్తికేయ-2 రెండు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే?

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

Karthikeya 2 Two Days Collections: కార్తికేయ-2 రెండు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే?

Karthikeya 2 Two Days Collections

Karthikeya 2 Two Days Collections: యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.

Karthikeya 2 Collections: అమెరికాలో అదరగొట్టిన కార్తికేయ-2.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు హిందీ బెల్ట్‌లో రెండో రోజు అదిరిపోయే రీతిలో థియేటర్ల సంఖ్య పెరగడం ఈ సినిమాకు ఉన్న హైప్‌కు ఉదాహరణగా చెప్పాలి. ఇక ఈ సినిమా తొలిరోజున మోస్తరు వసూళ్లు రాబట్టినా, రెండో రోజున వసూళ్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజులు ముగిసే సరికి ఏకంగా రూ.10 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు ఈ వసూళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

Karthikeya 2 : మొదటి రోజు 50.. రెండో రోజు 300 షోలు.. నార్త్ లో అదరగొడుతున్న కార్తికేయ 2..

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన కార్తికేయ-2 సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్షలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందించారు. కాగా ఏరియాల వారీగా కార్తికేయ-2 సినిమా రెండు రోజుల వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.60 కోట్లు
సీడెడ్ – 1.09 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.95 కోట్లు
ఈస్ట్ – 0.62 కోట్లు
వెస్ట్ – 0.45 కోట్లు
గుంటూరు – 0.75 కోట్లు
కృష్ణా – 0.57 కోట్లు
నెల్లూరు – 0.28 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 7.31 కోట్లు (రూ.11.15 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.45 కోట్లు
ఓవర్సీస్ – 2.15 కోట్లు
నార్త్ ఇండియా – 0.16 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.10.07 కోట్లు(రూ.17 కోట్ల గ్రాస్)