Karthikeya 2 : బాలీవుడ్ టాప్ 10 లో కార్తికేయ 2.. సరికొత్త రికార్డ్ సృష్టించిన నిఖిల్..

ఇటీవల విడుదలైన నిఖిల్ కార్తికేయ2 కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. కేవలం ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు..............

Karthikeya 2 : బాలీవుడ్ టాప్ 10 లో కార్తికేయ 2.. సరికొత్త రికార్డ్ సృష్టించిన నిఖిల్..

Karthikeya 2 movie enters into Bollywood Top 10 south movies collections list

Karthikeya 2 : హ్యాపీ డేస్ మూవీలో ఒక అల్లరి కుర్రాడిలా కనిపించిన నిఖిల్ ఆ తర్వాత విజయాలు, అపజయాలు చూసి కొంతకాలంగా కొత్త కధల ఎంపికతో హిట్ మీద హిట్ కొట్టుకుంటూ దూసుకు పోతున్నాడు. ఇటీవల విడుదలైన నిఖిల్ కార్తికేయ2 కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. కేవలం ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది.

ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక హిందీ బెల్టులో కార్తికేయ 2 సినిమాకి ఇప్పటివరకు దాదాపు 20 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.

Jalsa Movie Re Release : పవన్ ‘జల్సా’ రీ రిలీజ్.. మరోసారి రికార్డుల మోత..

దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాల్లో నిలిచింది అని సమాచారం. చిన్న సినిమాగా రిలీజ్ అయి విడుదలై రెండు వారాలు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతుంది అంటే సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో అర్ధమవుతుంది. అసలు బాలీవుడ్ లో ప్రేక్షకులు థియేటర్ లకి రాని సమయంలో నిఖిల్ కార్తికేయ 2 ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడమే కాక అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాల లిస్ట్ లోకి వచ్చిందంటే ఇది భారీ విజయమే.