Jalsa Movie Re Release : పవన్ ‘జల్సా’ రీ రిలీజ్.. మరోసారి రికార్డుల మోత..

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్ షోస్ గాను మూవీ టీం ఆన్లైన్ లో టికెట్లని రిలీజ్..............

Jalsa Movie Re Release : పవన్ ‘జల్సా’ రీ రిలీజ్.. మరోసారి రికార్డుల మోత..

Pawan Kalyan Jalsa Movie Re Release creates New Records

Updated On : August 30, 2022 / 1:06 PM IST

Jalsa Movie Re Release :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా ఎంతటి విజయాన్ని అందుకుందో మన అందరికి తెలుసు. ముఖ్యంగా అందులోని పాటలు ‘సరిగమ పదనిస’, ‘గాల్లో తేలినట్టుందే’, అంటూ సాగే పాటలు అప్పటి కుర్రకారులని ఉర్రూతలు ఊగించాయి. ఇంక మాటల మాంత్రికుడు మాటలు, మహేష్ బాబు వాయిస్ ఓవర్ సినిమాకి మరింత అందాన్ని తెచ్చాయి.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్ షోస్ గాను మూవీ టీం ఆన్లైన్ లో టికెట్లని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే టిక్కెట్లు అమ్ముడుపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ అభిమానులు అయితే అదీ పవన్ రేంజ్ అంటూ వారి అభిమాన నటుడు గురించి చెప్పుకుంటున్నారు.

Brahmaji : ఇంత ఆలస్యం.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ప్రభుత్వ ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన బ్రహ్మాజీ..

అయితే ఈ స్పెషల్ షోస్ తో పాటు తమ్ముడు మూవీని కూడా కొన్ని చోట్ల ప్రదర్శించబోతున్నారు. తమ అభిమాన నటుడిని వెండితెరపై చూసుకుని ఏడాది కావడంతో ఈ స్పెషల్ షోస్ తో అభిమానాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ స్పెషల్ షోస్ తో వచ్చిన కలెక్షన్ లని ఛారిటీకి ఇస్తున్నట్టుగా అభిమాన సంఘాలు వెల్లడించాయి. పవన్ అభిమానులు అంటే పవన్ ని అభిమానించడమే కాదు పవన్ సిద్ధాంతాలని కూడా అనుసరించడం అంటూ తమ అభిమాన నటుడిపై ఉన్న అమితమైన అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల మహేష్ పోకిరి రీ రిలీజ్ అయి భారీగా కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు జల్సా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.