Brahmaji : ఇంత ఆలస్యం.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ప్రభుత్వ ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన బ్రహ్మాజీ..

తాజాగా బ్రహ్మజీ చండీఘడ్ నుంచి కులు వెళ్లాల్సి ఉండగా తాను వెళ్లాల్సిన ఫ్లైట్ చాలా ఆలస్యంగా వచ్చింది. మొదట రెండు గంటలు వెయిట్ చేసి తన ఓపిక నశించడంతో ట్విట్టర్ లో ఆ విమాన సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు........

Brahmaji : ఇంత ఆలస్యం.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ప్రభుత్వ ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన బ్రహ్మాజీ..

Brahmaji satires on government airlines

 

Brahmaji :  నటుడు బ్రహ్మాజీ వరుస సినిమాలతి మంచి క్యారెక్టర్స్ తో మెప్పిస్తున్నారు. సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ పడితే ఎంతగా నవ్విస్తారో రియల్ లైఫ్ లో కూడా అంతే సరదాగా ఉంటారు బ్రహ్మాజీ. ఎవరి మీద అయినా కోపం వస్తే సెటైరికల్ గా కౌంటర్లు వేస్తారు బ్రహ్మాజీ.

తాజాగా బ్రహ్మజీ చండీఘడ్ నుంచి కులు వెళ్లాల్సి ఉండగా తాను వెళ్లాల్సిన ఫ్లైట్ చాలా ఆలస్యంగా వచ్చింది. మొదట రెండు గంటలు వెయిట్ చేసి తన ఓపిక నశించడంతో ట్విట్టర్ లో ఆ విమాన సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ”నేను చండీగఢ్ నుంచి కులు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. విమానం లేట్ అయినందుకు అలయన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం కానీ, క్షమాపణ కానీ లేదు” అని పోస్ట్ చేశారు బ్రహ్మాజీ.

Allu Arjun : న్యూయార్క్‌లో హాలీవుడ్ డైరెక్టర్‌ని కలిసిన అల్లు అర్జున్.. సినిమా కోసమేనా?

ఇక ఐదుగంటల నిరీక్షణ తర్వాత బ్రహ్మాజీ వెళ్లాల్సిన విమానం రాగా విమానం ఫోటోని పోస్ట్ చేసి..” ఐదుగంటల తర్వాత నేను ఎక్కాల్సిన విమానం వచ్చింది. ఇప్పటికి కూడా ఎటువంటి సమాచారం, క్షమాపణ లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి” అంటూ అలయన్స్ ఎయిర్ లైన్స్ ని ట్యాగ్ చేస్తూ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. దీంతో బ్రహ్మాజీ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.