Allu Arjun : న్యూయార్క్‌లో హాలీవుడ్ డైరెక్టర్‌ని కలిసిన అల్లు అర్జున్.. సినిమా కోసమేనా?

ఇటీవల ఆజాది కా అమృత్ మహోత్సవ స్వతంత్ర వేడుకులకు న్యూయార్క్ వెళ్లిన అల్లు అర్జున్ ఒక హాలీవుడ్ డైరెక్టర్ ని కలిశారంటూ, కధా చర్చలు కూడా జరిగాయి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ కుదిరితే...........

Allu Arjun : న్యూయార్క్‌లో హాలీవుడ్ డైరెక్టర్‌ని కలిసిన అల్లు అర్జున్.. సినిమా కోసమేనా?

Allu Arjun meets Hollywood Director

Allu Arjun : తగ్గేదేలే అంటూ ఒక యూనిక్ మేనరిజంతో ప్రమంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పుష్ప..పుష్పరాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హాలీవుడ్ కి వెళుతున్నారు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో పుష్ప2 సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. పుష్ప భారీ విజయాన్ని సాధించడంతో దర్శకుడు సుకుమార్ పుష్ప2 కథని అంతకుమించి ఉండేలా సిద్ధం చేశాడు.

వచ్చే నెల నుంచి పుష్ప 2 రెగ్యులర్ షూట్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2 తో బన్నీ ఈ సారి వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో బన్నీ హాలీవుడ్ డైరెక్టర్ ని కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.

Raviteja Ravanasura Movie : రవితేజ సినిమా కోసం 5 కోట్లతో సెట్.. భారీగా ప్లాన్ చేస్తున్న రావణాసుర..

ఇటీవల ఆజాది కా అమృత్ మహోత్సవ స్వతంత్ర వేడుకులకు న్యూయార్క్ వెళ్లిన అల్లు అర్జున్ ఒక హాలీవుడ్ డైరెక్టర్ ని కలిశారంటూ, కధా చర్చలు కూడా జరిగాయి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ కుదిరితే అల్లు అర్జున్ త్వరలో హాలీవుడ్ డెబ్యూ ఇవ్వడం కాయం అంటున్నారు బన్నీ అభిమానులు. అయితే ఈ వార్తలో నిజమెంత ఉన్నది అన్న విషయం మాత్రం తెలియదు. ఒకవేళ బన్నీ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తే తన రేంజ్ పాన్ వరల్డ్ గా పెరిగినట్టే.