Kantara: KGF నిర్మాతల నుంచి మరో అద్భుతమైన మూవీ..

ఇండియన్ సూపర్ హిట్ మూవీ కెజిఫ్-1&2 తెరకెక్కించిన "హోంబలే ఫిల్మ్స్" పతాకంపై మరో బ్లాక్ బస్టర్ మూవీ రానుంది.కన్నడ నటుడు మరియు దర్శకుడు "రిషబ్ శెట్టి"తో కలిసి కెజిఫ్ నిర్మాతలు "కాంతారా" అనే మరో మాస్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కన్నడనాట సూపర్ హిట్ గా నిలిచింది.

Kantara: KGF నిర్మాతల నుంచి మరో అద్భుతమైన మూవీ..

KGF Producers Kantara Movie Trailer Released

Kantara: ఇండియన్ సూపర్ హిట్ మూవీ కెజిఫ్-1&2 తెరకెక్కించిన “హోంబలే ఫిల్మ్స్” పతాకంపై మరో బ్లాక్ బస్టర్ మూవీ రానుంది.కన్నడ నటుడు మరియు దర్శకుడు “రిషబ్ శెట్టి”తో కలిసి కెజిఫ్ నిర్మాతలు “కాంతారా” అనే మరో మాస్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కన్నడనాట సూపర్ హిట్ గా నిలిచింది.

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి నరేంద్రమోదీ ట్వీట్..

ఇప్పుడు ఈ సినిమాను ఇతరు భాషల్లో కూడా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు ధియేటరికల్ రైట్స్ ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా “కాంతారా” అనే టైటిల్ తోనే విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. కాంతారా అంటే అడవి అని అర్ధం. అడవి వాసులు మరియు అటవీశాఖ పోలీస్ అధికారి మధ్య జరిగే ఘర్షణే ఈ సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కెజిఫ్ అంతటి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.