Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి నరేంద్రమోదీ ట్వీట్..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి హఠాన్మరణం గురించి మనందరికి తెలిసింది. అయన మరణ వార్త విని కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇక అయన అకాల మరణంతో పునీత్ నటించిన కొన్ని చిత్రాలు సెట్స్ పైనే నిలిచిపోయాయి. మూవీ మేకర్స్ ఇప్పుడు ఆ సినిమాలను పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, పవర్ స్టార్ కు ట్రిబ్యూట్ ఇచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే...

Narendra Modi Tweet on Puneeth Rajkumar
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి హఠాన్మరణం గురించి మనందరికి తెలిసింది. అయన మరణ వార్త విని కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇక అయన అకాల మరణంతో పునీత్ నటించిన కొన్ని చిత్రాలు సెట్స్ పైనే నిలిచిపోయాయి.
మూవీ మేకర్స్ ఇప్పుడు ఆ సినిమాలను పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, పవర్ స్టార్ కు ట్రిబ్యూట్ ఇచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పునీత్ నటించిన “గంధడగుడి” విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ట్రైలర్ ను మూవీ టీం ట్విట్టర్ వేదికగా ‘నరేంద్రమోదీ’ని ట్యాగ్ చేస్తూ విడుదల చేసింది.
“నమస్తే నరేంద్రమోదీ గారు, ఈరోజు మాకు ఎమోషనల్ డే.. అప్పు ఎల్లప్పుడూ మీతో ముఖ్యమైన విషయాలను పంచుకోవడానికి ఇష్టపడేవాడు. అతడి మనసుకు దగ్గరైన ప్రాజెక్ట్ “గంధడగుడి” ట్రైలర్‌ని మేము ఇవాళ విడుదల చేస్తున్నాం” అంటూ ట్వీట్ చేసింది చిత్ర యూనిట్.
అందుకు మోదీ బదులిస్తూ.. “అప్పు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలలో జీవిస్తూనే ఉంటాడు. అతను గొప్ప హృదయం కలవాడు. ‘గంధడగుడి’ సినిమా ప్రకృతి తల్లికి, కర్ణాటక ప్రకృతి అందం మరియు పర్యావరణ పరిరక్షణకు నివాళి. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.