Godfather: గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, గాడ్‌ఫాదర్ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

Godfather: గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా..?

Location Finalised For Godfather Pre-Release Event

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Godfather: ‘గాడ్‌ఫాదర్’లో ఆ పాత్రను లేపేశారా..?

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి అభిమానుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను షురూ చేసేందుకు గాడ్‌ఫాదర్ టీమ్ రెడీ అయ్యింది. ఇందులో భాగంగా గాడ్‌ఫాదర్ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఇంకా దీనికి సంబంధించిన డేట్, టైమ్, చీఫ్ గెస్టుల వివరాలు తెలియాల్సి ఉన్నా.. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది ఎక్కడో తెలిసిపోయింది.

Godfather: గాడ్‌ఫాదర్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సాలిడ్‌గా కుదిరిందట!

గాడ్‌ఫాదర్ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అనంతపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను జోరుగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారు.. ఈ ఈవెంట్ ఏ రోజున జరుగుతుంది వంటి విషయాలను కూడా చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాధ్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.