Godfather: గాడ్‌ఫాదర్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సాలిడ్‌గా కుదిరిందట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి.

Godfather: గాడ్‌ఫాదర్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సాలిడ్‌గా కుదిరిందట!

Rama Jogaiah Sastry Gives Interesting Update On Godfather Movie

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ చిత్రంపై నెలకొన్ని అంచనాలు రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Godfather: తార్ మార్ టక్కర్ మార్.. అంటూ గాడ్‌ఫాదర్‌తో దుమ్ములేపిన సల్మాన్ ఖాన్

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సినిమాకు పాటలు అత్యద్భుతంగా కుదిరాయని.. థమన్ అందించిన సంగీతం చాలా బాగుందని.. ముఖ్యంగా బీజీఎం మరో లెవెల్‌లో ఉందని రామజోగయ్య శాస్త్రి తెలిపారు. ఈ అప్డేట్‌తో ఈ సినిమాలోని పాటలు ఎలా ఉండబోతున్నాయా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

GodFather: చిరుతో సల్లూ భాయ్‌ స్టెప్‌లు.. గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.