SSMB28 Shooting: మొదలెట్టేందుకు సిద్ధం అంటోన్న మహేష్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

SSMB28 Shooting: మొదలెట్టేందుకు సిద్ధం అంటోన్న మహేష్.. ఎప్పుడంటే?

Mahesh Babu To Start SSMB28 Shooting

SSMB28 Shooting: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB28: మహేష్ బాబు ఆ రిస్క్ చేయడా..?

అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్ 2వ వారంలో మొదలుపెట్టేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇక త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఓ పవర్‌ప్యాక్డ్ స్క్రిప్టును రెడీ చేశాడని.. ఈ సినిమాతో మహేష్ – త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

SSMB28 Movie Release Date Locked: మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని.. ఈ మూవీలో ఆయన పాత్రను సరికొత్తగా డిజైన్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుంది.