SSMB28: మహేష్ బాబు ఆ రిస్క్ చేయడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో రానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నాడట.

SSMB28: మహేష్ బాబు ఆ రిస్క్ చేయడా..?

Mahesh Babu Not Taking Risk With SSMB28

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఇక మహేష్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

SSMB28 Movie Release Date Locked: మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో రానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూడో సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని మహేష్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నాడట.

SSMB28: మహేష్ కోసం ఇద్దరు స్టార్స్..?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మహేష్ 28వ చిత్రాన్ని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని, ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయొద్దని చిత్ర యూనిట్ భావిస్తోంది. మహేష్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలే మహేష్-త్రివిక్రమ్ కాంబో అంటే ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇలా కేవలం తెలుగులోనే తమ సినిమాను రిలీజ్ చేయాలని మహేష్ భావిస్తుండటం వెనకాల కారణం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి నిజంగానే మహేష్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయకుండా ఉంటాడా? అనేది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.