SSMB28: మహేష్ కోసం ఇద్దరు స్టార్స్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఇద్దరు స్టార్ యాక్టర్స్‌ను బరిలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది.

SSMB28: మహేష్ కోసం ఇద్దరు స్టార్స్..?

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూడో సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

SSMB28 : త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో నందమూరి హీరో.. మళ్ళీ విలన్‌గా..

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డేను ఫిక్స్ చేసిన త్రివిక్రమ్, ఈ సినిమా కథ కోసం ఇద్దరు స్టార్ యాక్టర్స్‌ను బరిలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటు, తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించనున్నాడట. ఇప్పటికే వీరిద్దరికీ త్రివిక్రమ్ కథను కూడా వినిపించాడని చిత్రపురిలో టాక్. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర చేయబోయేది ఓ కీలక పాత్ర అని.. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

SSMB28: మహేష్‌తో మాంత్రికుడు.. శ్రీలీల కోసం కథలో మార్పులు?

అటు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేయబోతున్నాడట. గతంలో ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన విజయ్ సేతుపతి, ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీలో తన పర్ఫార్మెన్స్‌తో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. మరి మహేష్ బాబు మూవీలో ఈ యాక్టర్ ఎలాంటి రోల్ చేస్తాడా.. ఆయన ఈ సినిమాలో మహేష్ బాబును ఎలా ఢీకొడతాడు అనేది అభిమానుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.