SSMB28: మహేష్‌తో మాంత్రికుడు.. శ్రీలీల కోసం కథలో మార్పులు?

సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

SSMB28: మహేష్‌తో మాంత్రికుడు.. శ్రీలీల కోసం కథలో మార్పులు?

Ssmb28

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఇప్పటికే కొన్ని పేర్లు వినిపించగా.. ముఖ్య పాత్రలలో మోహన్ లాల్, శోభన, త్రిష ఇలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి.

SSMB28: మహేష్ సినిమాతో శోభన రీఎంట్రీ.. ఆమె పాత్ర ఏంటంటే?

వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో తెలియదు కానీ.. సెకండ్ ఫీమేల్ లీడ్ లో నటించనున్న భామ ఈమెనే అంటూ ఇప్పుడు మరో పేరు కూడా వినిపిస్తుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అర డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుందని టాక్ నడుస్తుంది. అంతేకాదు శ్రీలీల కోసమే కథలో మార్పులు చేర్పులు కూడా చేశారని చెప్పుకుంటున్నారు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ లాల్!

ముందుగా అనుకున్న కథలో సెకండ్ ఫీమేల్ లీడ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదట. ఏదో గ్లామర్ కోసం రెండో హీరోయిన్ రోల్ ని క్రియేట్ చేశారట. అయితే ఇప్పుడు శ్రీలీలను ఎంచుకోవడంతో ఆమె కోసమే కథలో చేర్పులు చేశారట. ఈ సినిమాలో మహేష్ తో శ్రీలీలకు ఓ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను జోడిస్తున్నారట. ఒక ఫ్యామిలీ సాంగ్ ,ఒక లవ్ డ్యూయెట్ లో మహేష్ తో ఆడిపాడనుందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!