Mahesh Babu: సినిమాలే కాదు సీరియల్స్ కూడా చూడాలంటున్న మహేష్.. సితారతో కలిసి సీరియల్స్ కోసం మహేష్ ప్రమోషనల్ సాంగ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూనే, ప్రమోషనల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఛానల్ లో ప్రసారమయ్యే కొత్త సీరియల్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. కూతురు సితారతో కలిసి మహేష్ బాబు "పడమట సంధ్యారాగం" అనే కొత్త సీరియల్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోలో నటించారు. ఆ ప్రోమో సంబంధిత ఛానల్ ప్రసారం అవ్వడంతో, ఆ సీరియల్ పై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఛానల్ వారు మహేష్ బాబు క్రేజ్ ని ఉపయోగించుకుని...

Mahesh Babu: సినిమాలే కాదు సీరియల్స్ కూడా చూడాలంటున్న మహేష్.. సితారతో కలిసి సీరియల్స్ కోసం మహేష్ ప్రమోషనల్ సాంగ్!

Mahesh Sitara Promotional Video Song for Serials

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూనే, ప్రమోషనల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. టాలీవుడ్ నుంచి దాదాపు 10కి పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, సినిమాలోనే కాదు కమర్షియల్ యాడ్స్ లోను నెంబర్-1 అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఛానల్ లో ప్రసారమయ్యే కొత్త సీరియల్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు.

Mahesh Babu In TV Serial: కూతురు సితారతో కలిసి సీరియల్స్ లో మెరవనున్న సూపర్ స్టార్.. నిజమేనా?
కూతురు సితారతో కలిసి మహేష్ బాబు “పడమట సంధ్యారాగం” అనే కొత్త సీరియల్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోలో నటించారు. ఆ ప్రోమో సంబంధిత ఛానల్ ప్రసారం అవ్వడంతో, ఆ సీరియల్ పై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఛానల్ వారు మహేష్ బాబు క్రేజ్ ని ఉపయోగించుకుని మరో రెండు కొత్త సీరియల్స్ ని ప్రమోట్ చేస్తూ.. ‘మహేష్-సితార’ల పై ఒక ప్రమోషనల్ సాంగ్ ని షూట్ చేసింది.

ఈ సాంగ్ ని సితార తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. “నాన్నతో నటించడం, నాకు ఒక అద్భుతమైన అనుభవం.
ప్రోమో షూటింగ్‌ సమయంలో నాన్నతో చాలా ఎంజాయ్‌ చేశాను” అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మూడు నిమిషాల నిడివి ఈ ప్రమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మహేష్ క్రేజ్ ఈ సీరియల్స్ కు ఎంతగా కలిసొస్తుందో చూడాలి.