Mahesh Babu In TV Serial: కూతురు సితారతో కలిసి సీరియల్స్ లో మెరవనున్న సూపర్ స్టార్.. నిజమేనా?

మహేష్ బాబు తనదైన నటనాశైలితో, కామెడీ టైమింగ్ మరియు యాక్షన్స్ సీన్స్ తో తెలుగు నాట సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు టెలివిజన్ షోలకు హాజరు కావడం చాల అరుదు. ఇటీవల ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ "డాన్స్ ఇండియా డాన్స్" షోకు కూతురు సితారతో కలిసి వచ్చి సందడి చేశాడు. మహేష్ రాకతో ఆ ఛానల్ TRP అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్ నే ఉపయోగించుకుని అదే ఛానల్ వారు కొత్త సీరియల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు.

Mahesh Babu In TV Serial: కూతురు సితారతో కలిసి సీరియల్స్ లో మెరవనున్న సూపర్ స్టార్.. నిజమేనా?

Mahesh Babu and Sitara Acted in Telivision Serial

Updated On : September 13, 2022 / 11:16 AM IST

Mahesh Babu In TV Serial: మహేష్ బాబు తనదైన నటనాశైలితో, కామెడీ టైమింగ్ మరియు యాక్షన్స్ సీన్స్ తో తెలుగు నాట సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. మహేష్ వరుస హిట్ సినిమాలు అందిచడమే కాకుండా ప్రమోషనల్ యాడ్స్ కూడా చేస్తూ, వాటి ద్వారా వచ్చే డబ్బుని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఆఫ్ స్క్రీన్ లో కూడా నెంబర్ వన్ హీరో అనిపించుకుంటున్నాడు.

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు టెలివిజన్ షోలకు హాజరు కావడం చాల అరుదు. ఇటీవల ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ “డాన్స్ ఇండియా డాన్స్” షోకు కూతురు సితారతో కలిసి వచ్చి సందడి చేశాడు. మహేష్ రాకతో ఆ ఛానల్ TRP అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్ నే ఉపయోగించుకుని అదే ఛానల్ వారు కొత్త సీరియల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో మహేష్, సితార లతో పాటు మిగిలిన సీరియల్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. గతంలో కూడా మహేష్ బాబు ఒక సీరియల్ కోసం ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీరియల్ లో మహేష్ అండ్ సితార గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారా లేక ప్రమోషన్స్ మాత్రమేనా అనేవి తెలియాలంటే సీరియల్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే. కాగా మహేష్ తన కొత్త సినిమా ‘SSMB28’ షూటింగ్ సోమవారం ప్రారంభించారు.