Manchu Lakshmi : మంచులక్ష్మీ ‘ఆహా’ అనిపించడానికి మళ్ళీ వస్తోంది.. ‘చెఫ్ మంత్ర’ సీజన్ 2 త్వరలో..

తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్, షోలు, సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు తీసుకొచ్చి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. గతంలో మంచు లక్ష్మి యాంకర్ గా చెఫ్ మంత్ర అనే.............

Manchu Lakshmi : మంచులక్ష్మీ ‘ఆహా’ అనిపించడానికి మళ్ళీ వస్తోంది.. ‘చెఫ్ మంత్ర’ సీజన్ 2 త్వరలో..

Manchu Lakshmi New Show Chef Mantra Season 2 coming soon in Aha

Manchu Lakshmi :  తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్, షోలు, సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు తీసుకొచ్చి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. గతంలో మంచు లక్ష్మి యాంకర్ గా చెఫ్ మంత్ర అనే ఓ సరికొత్త ప్రోగ్రాంని చేశారు. ఇందులో పలువురు సెలబ్రిటీలని తీసుకొచ్చి వారితో వంటలు వండించి, సరదాగా కబుర్లు చెప్తూ, వారికిష్టమైన ఫుడ్ గురించి తెలుసుకుంటూ షోని చాలా బాగా రన్ చేశారు.

Suhasini : పొన్నియిన్ సెల్వన్ వల్ల మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను..

తాజాగా అదే కాన్సెప్ట్ తో మరోసారి మంచు లక్ష్మీ యాంకర్ గా ‘చెఫ్ మంత్ర’ సీజన్‌ 2 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయ్యాయి. తాజాగా చెఫ్ మంత్ర సీజన్ 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సారి మరింతమంది సెలబ్రిటీలని షోకి తీసుకురానున్నారు. ఈ కొత్త ప్రోగ్రాం సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. మరి ఈ సారి ఏ రేంజ్ లో మంచు లక్ష్మి చెఫ్ మంత్రతో ఆహా అనిపిస్తుందో చూడాలి.