Suhasini : పొన్నియిన్ సెల్వన్ వల్ల మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను..

ఈ ఈవెంట్లో సుహాసిని మాట్లాడుతూ.. ''పెళ్లికి ముందు మణిరత్నం గారు నాకు ఓ పెద్ద బ్యాగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఐదు భాగాలు ఉన్నాయి. వాటిని చదివి ఒక్క లైన్ లో............

Suhasini : పొన్నియిన్ సెల్వన్ వల్ల మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను..

Suhasini speech at Ponniyin Selvan 1 Pre Release Event

Suhasini :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీంతో స్టార్లంతా హైదరాబాద్ లో సందడి చేశారు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

Vikram : మీరు తెలుగు ప్రేక్షకులు కాదు.. సినిమా పిచ్చోళ్ళు..

ఈ ఈవెంట్లో సుహాసిని మాట్లాడుతూ.. ”పెళ్లికి ముందు మణిరత్నం గారు నాకు ఓ పెద్ద బ్యాగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఐదు భాగాలు ఉన్నాయి. వాటిని చదివి ఒక్క లైన్ లో కథ చెప్పమన్నారు. నేను ఆ అయిదు భాగాలని చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. అది చూసి ఆయన ఇలాగేనా రాసేది అన్నారు. అప్పుడు నేను భయపడ్డాను నేను సరిగ్గా రాయలేదేమో, ఈ నవల వల్ల మా పెళ్లి అగైపోతుందేమో అని. కానీ మా పెళ్లయింది. మా పెళ్లి అయిన 34 ఏళ్లకి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా తీశారాయన. దానికి ముఖ్య కారణం అయిన నిర్మాత సుభాస్కరన్‌ గారికి థ్యాంక్స్‌. తెలుగు ప్రేక్షకులు నలభై రెండేళ్లుగా నాపై ప్రేమని చూపిస్తున్నారు. ఆ ప్రేమని ‘పొన్నియిన్‌ సెల్వన్‌’పై కొంచెం చూపించండి. ఈ సినిమా ఓ పది శాతం షూటింగ్‌ మాత్రమే పాండిచ్చేరి, చెన్నైలో జరిగింది. మిగిలినదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లోనే చేశాం. ఇది తెలుగు సినిమా, మీరు ఆదరించాలి” అని తెలిపారు.