Vikram : మీరు తెలుగు ప్రేక్షకులు కాదు.. సినిమా పిచ్చోళ్ళు..

ఈ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ''మీరు తెలుగు ప్రేక్షకులు కాదు సినిమా ప్రేక్షకులు, సినిమా పిచ్చివాళ్ళు. మీరు సినిమాలపై చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్యూ. నేను ఒక్కొక్క సినిమాలో ఒక్కో నటన చేశాను. ఈ సినిమాలో.......................

Vikram : మీరు తెలుగు ప్రేక్షకులు కాదు.. సినిమా పిచ్చోళ్ళు..

Vikram Speech at Ponniyin Selvan 1 Pre Release Event

Vikram :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీంతో స్టార్లంతా హైదరాబాద్ లో సందడి చేశారు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

Karthi : ఆల్రెడీ బాహుబలి చూశాం.. ఇంకో బాహుబలి అవసర్లేదు..

ఈ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ”మీరు తెలుగు ప్రేక్షకులు కాదు సినిమా ప్రేక్షకులు, సినిమా పిచ్చివాళ్ళు. మీరు సినిమాలపై చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్యూ. నేను ఒక్కొక్క సినిమాలో ఒక్కో నటన చేశాను. ఈ సినిమాలో ఒకే ఒక్క షాట్ లో గుర్రం మీద వస్తున్నప్పుడు బాగా చేశాను అని అనిపించింది. ఇంతమంది స్టార్లు అందరూ సినిమాలో హీరోస్, హీరోయిన్స్ లాగా కనిపిస్తారు. ఇంతమంది కలిసి ఒక సినిమాలో చేయడం రికార్డ్. మణిరత్నం గారి కోసమే ఇంతమంది వచ్చి ఈ సినిమా చేశారు. మణిరత్నం గారితో సినిమా చేసినా మళ్ళీ మళ్ళీ చేయాలనేది నా కల” అని అన్నారు.