Manchu Vishnu : జిన్నా షూటింగ్ లో మంచు విష్ణుకి గాయాలు.. ఆ మాస్టర్ వల్లే అంటూ పోస్ట్..

మంచు విష్ణు కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్లను రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా జిన్నా సినిమాలో ఓ పాటని షూట్ చేస్తుండగా విష్ణు డ్యాన్స్ చేస్తుంటే గాయాలు అయినట్టు పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో..................

Manchu Vishnu : జిన్నా షూటింగ్ లో మంచు విష్ణుకి గాయాలు.. ఆ మాస్టర్ వల్లే అంటూ పోస్ట్..

Manchu Vishnu injured while Ginna Movie Shoot

Manchu Vishnu :  మంచు విష్ణు ఇటీవల ‘మా’ ప్రెసిడెంట్ గా సోషల్ మీడియాలో రోజూ కనిపిస్తూనే ఉన్నారు. ఇక తన కొత్త సినిమాల అప్డేట్లు రెగ్యులర్ గా ఇస్తూ హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా జిన్నా అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. మాస్ కామెడీ నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

BiggBoss 6 : బిగ్‌బాస్‌ గ్లింప్స్.. కొత్త బిగ్‌బాస్‌ ఇంటిని చూశారా.. వెయిటింగ్ అంటున్న అభిమానులు..

మంచు విష్ణు కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్లను రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా జిన్నా సినిమాలో ఓ పాటని షూట్ చేస్తుండగా విష్ణు డ్యాన్స్ చేస్తుంటే గాయాలు అయినట్టు పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కాలికి అయిన గాయాన్ని పోస్ట్ చేసి.. ఇది జిన్నా సినిమా షూట్ లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు జరిగింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వల్లే ఇది జరిగింది అని పోస్ట్ చేశాడు. దీంతో ఎప్పటిలాగానే నెటిజన్లు మొదటి సారి డ్యాన్స్ చేస్తున్నారా, ఇది కూడా గాయమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.