The Warriorr: ఇస్మార్ట్ రామ్‌తో మాస్ లింగుస్వామి.. కసి మొత్తం చూపించేస్తారా?

లవర్ బాయ్ నుంచి యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లోకి మారిపోయాడు రామ్ పోతినేని. ఒక్క టీజర్ తోనే హై ఓల్టేజ్ యాక్షన్ చూపిస్తున్న ఉస్తాద్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వారియర్ తో వచ్చి హిట్ కొడతాడా అంటూ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో చర్చ మొదలైంది.

The Warriorr: ఇస్మార్ట్ రామ్‌తో మాస్ లింగుస్వామి.. కసి మొత్తం చూపించేస్తారా?

The Warriorr

The Warriorr: లవర్ బాయ్ నుంచి యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లోకి మారిపోయాడు రామ్ పోతినేని. ఒక్క టీజర్ తోనే హై ఓల్టేజ్ యాక్షన్ చూపిస్తున్న ఉస్తాద్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వారియర్ తో వచ్చి హిట్ కొడతాడా అంటూ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో చర్చ మొదలైంది. తెలుగు, తమిళ లాంగ్వేజ్ లో మాస్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న సినిమా ది వారియర్.. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలా కనిపిస్తోంది.

The Warriorr Teaser: వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. వారియర్‌ వచ్చేశాడు

ఈ సినిమాలో రామ్ లుక్, మాసివ్ డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమాలో వైలెంట్ పోలీస్ ఆఫీసర్ సత్య క్యారెక్టర్ లో రామ్ నటిస్తున్నాడు. రెడ్ ఫ్లాప్ తర్వాత హీరో రామ్ ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని, కసిగా ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే హీరోకి యాక్షన్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన లింగుస్వామి లాంటి డైరెక్టర్ దొరికితే ఎలా ఉంటుందో టీజర్ లోనే రుచి చూపించారు ఇస్మార్ట్ రామ్, డైరెక్టర్ లింగుస్వామి. పందెంకోడి 2 ఫ్లాప్ తర్వాత లింగుస్వామి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కమిట్మెంట్తో వారియర్ ను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.

The Warriorr: వారియర్ నుండి మరో పోస్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న మేకర్స్

ఫస్ట్ సినిమాతోనే గ్లామర్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్న కృతిశెట్టి వరస సక్సెస్ లతో దూసుకెళ్తోంది. మరింత గ్లామర్ డోస్ పెంచి, ది వారియర్ లో రామ్ సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆదిపినిశెట్టి గెటప్పే కొత్తగా ఉంది. ఈ సినిమాలో రామ్ కి తల్లిగా చేసిన నదియా డైలాగ్ కూడా పవర్ ఫుల్ గానే ఉంది. మొత్తానికి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న లింగుస్వామి, ఉస్తాద్ రామ్ కు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను ఇస్తుందో తెలియాలంటే, జులై 14 వరకు ఆగాల్సిందే.