The Warriorr Teaser: వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. వారియర్ వచ్చేశాడు
విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

The Warriorr Teaser
The Warriorr Teaser: విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే భావనతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు.
The Warriorr: వారియర్ నుండి మరో పోస్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న మేకర్స్
గతేడాదిలో వచ్చిన ‘రెడ్’లో కూడా సిద్ధార్థ పాత్రలో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్‌డేట్‌లతో ప్రేక్షకులను పలకరిస్తుంది. ఇప్పటికే ఇంటెన్సివ్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేసిన వారియర్ టీం తాజాగా శనివారం పక్కా యాక్షన్ తో కూడిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది.
The Warriorr: యాక్షన్ సినిమానే కానీ హీరో మతి మరుపు పోలీస్?
ఈ టీజర్ లో హీరో రామ్ పోలీస్ గెటప్ లో అదరగొట్టాడు. మొదటిసారి పోలీస్ గెటప్ చేసినప్పటికీ.. యాక్టింగ్ లో ఇరగదీశాడు. అటు ఆది కూడా విలన్ గా దుమ్ములేపేసాడు. అలాగే కృతిశెట్టి అందంతో కట్టిపడేసింది. టీజర్ చూస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ బాషలలో విడుదల కానున్న ఈ సినిమా రామ్ నుండి ప్రేక్షకులు కోరుకొనే ఎనర్జీ యాక్షన్ ఫీస్ట్ గా ఉండనున్నట్లు కనిపిస్తుంది.