Mega Block Buster : మెగా బ్లాక్ బస్టర్.. ఇది యాడ్ ప్రమోషనా.. మీషో ఒక్క యాడ్ కోసం ఇంతమంది స్టార్లా??

తాజాగా ప్రముఖ ఆన్లైన్ సేల్స్ యాప్ మీషో తన యాడ్స్ ని రిలీజ్ చేసింది. త్వరలో మెగా బ్లాక్ బస్టర్ సేల్స్ మొదలవ్వనున్నాయ్ అంటూ యాడ్స్ రిలీజ్ చేసింది. ఇందుకు ఈ స్టార్లందరితో కలిపి యాడ్స్.............

Mega Block Buster : మెగా బ్లాక్ బస్టర్.. ఇది యాడ్ ప్రమోషనా.. మీషో ఒక్క యాడ్ కోసం ఇంతమంది స్టార్లా??

Meesho app done a ad with stars for Mega BlockBuster sale

Mega Block Buster :  ఇటీవల పెద్ద పెద్ద కంపెనీలు తమ యాడ్ ప్రమోషన్స్ ని కొత్తకొత్తగా చేస్తున్నారు. డబ్బులు ఖర్చుపెట్టి మరీ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందుకోసం స్టార్స్ ని కూడా తీసుకొస్తున్నారు. ఇటీవల కొంతమంది స్టార్లు మెగా బ్లాక్ బస్టర్ అనే పేరుతో వల్ల ఫోటోలు ఉన్న పోస్టర్స్ ని షేర్ చేశారు. మొదట ఇది చూసినా వారంతా ఏదైనా కొత్త సినిమా అనుకున్నారు. కానీ చరణ్, కార్తీ, త్రిష, రష్మిక, రణవీర్, దీపికా, రోహిత్ శర్మ, గంగూలీ.. ఇలా అన్ని భాషల వాళ్ళు పెట్టడంతో ఇది సినిమా కాదు ఇంకేదైనా అని అనుకున్నారు.

తాజాగా ప్రముఖ ఆన్లైన్ సేల్స్ యాప్ మీషో తన యాడ్స్ ని రిలీజ్ చేసింది. త్వరలో మెగా బ్లాక్ బస్టర్ సేల్స్ మొదలవ్వనున్నాయ్ అంటూ యాడ్స్ రిలీజ్ చేసింది. ఇందుకు ఈ స్టార్లందరితో కలిపి యాడ్స్ చేయించింది మీషో. అయితే తెలుగు, తమిళ్, హిందీ కి సపరేట్ యాడ్స్ చేయించి ప్రమోట్ చేస్తుంది మీషో. తెలుగులో రామ్ చరణ్, రష్మికతో పాటు గంగూలీ, రోహిత్ శర్మ యాడ్ చేశారు. అన్ని భాషల్లో రోహిత్ శర్మ, గంగూలీ కామన్ గా ఉన్నారు. తమిళ్ లో త్రిష, కార్తితో, హిందీలో రణవీర్, దీపికా, కపిల్ శర్మతో ఈ యాడ్స్ చేయించారు.

Piracy Sites : సినిమా పైరసీ సైట్లని అణిచివేయాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు..

ఇంత మంది స్టార్స్ తో యాడ్స్ చేయించి మీషో గ్రాండ్ గా ప్రమోట్ చేయించింది. అయితే ఇదంతా ఒక మెగా బ్లాక్ బస్టర్ అని కొన్ని రోజులు సేల్స్ కోసం. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. మీషో ఇందుకోసం భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ మెగా బ్లాక్ బస్టర్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు ఉండనుంది. ఈ సేల్ మీషోలో ఉండే అన్ని రకాల వస్తువులపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.