Piracy Sites : సినిమా పైరసీ సైట్లని అణిచివేయాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు..

ఇప్పటికే అనేక సమస్యలు, ఫ్లాప్స్, బాయ్ కాట్ బాలీవుడ్ తో సతమతమవుతున్న బాలీవుడ్ కి ఇప్పుడు పైరసీ మరో పెద్ద సమస్యగా తయారైంది. త్వరలో బాలీవుడ్ నుంచి అలియా భట్, రణబీర్ కపూర్ నటించిన భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందే...........

Piracy Sites : సినిమా పైరసీ సైట్లని అణిచివేయాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు..

Delhi High Court issues orders to take serious action on Piracy Sites

Piracy Sites :  ఇటీవల పైరసీ సైట్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. గతంలో కూడా సినీ పరిశ్రమకి ఈ పైరసీ భూతం ఎన్నో కష్టాలని పెట్టింది. పోలీసులు, సైబర్ క్రైమ్ ఎన్ని చర్యలు తీసుకున్నా రోజు రోజుకి కొత్త పైరసీ సైట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనివల్ల సినీ పరిశ్రమకి భారీ నష్టం చేకూరుతుంది. ఇక ఓటీటీ వచ్చాక ఈ పైరసీ సైట్లు మరిన్ని ఎక్కువయ్యాయి. వీటిని సైబర్ క్రైమ్ కూడా ఏమి చేయలేనంత పడ్బందీగా నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే అనేక సమస్యలు, ఫ్లాప్స్, బాయ్ కాట్ బాలీవుడ్ తో సతమతమవుతున్న బాలీవుడ్ కి ఇప్పుడు పైరసీ మరో పెద్ద సమస్యగా తయారైంది. త్వరలో బాలీవుడ్ నుంచి అలియా భట్, రణబీర్ కపూర్ నటించిన భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందే కొన్ని పైరసీ సైట్స్ లో బ్రహ్మాస్త్ర సినిమా వచ్చేసింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ పైరసీ సైట్లతో తీవ్రంగా నష్టపోతున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుని కోరారు.

Aashiqui 3: బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ మూవీకి మరో సీక్వెల్.. ఆషికీ 3.. ఈ సారి కార్తీక్ ఆర్యన్ తో..

దీనిపై స్పందించిన జస్టిస్‌ జ్యోతిసింగ్‌ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 18 వెబ్‌సైట్లను ముద్దాయిలుగా చేర్చుతూ పైరసీని ప్రోత్సహించే ఇలాంటి వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాపీరైట్‌ ఉన్న కంటెంట్‌ని ప్రదర్శించినా, అందుబాటులో ఉంచినా, డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించినా, షేరింగ్‌కి అనుమతించినా, అప్‌లోడ్‌ సదుపాయం ఉన్నా అది చట్టాన్ని ఉల్లంఘించడమే అని చెప్తూ ఇలాంటి వెబ్‌సైట్లని వెంటనే నిషేధించాలి. ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు వీరికి సేవలు నిలిపివేయాలి. వీరిపై ఉక్కుపాదం మోపేలా కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలి అని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి ఇప్పటికైనా ఈ పైరసీ సైట్లపై ఉక్కుపాదం మోపుతారేమో చూడాలి.