Mega154 NBK107: బాలయ్య-చిరు సినిమా టైటిల్స్‌లో కామన్ పాయింట్.. నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 154’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా, ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అటు మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK107’ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి.

Mega154 NBK107: బాలయ్య-చిరు సినిమా టైటిల్స్‌లో కామన్ పాయింట్.. నిజమేనా?

Mega 154 NBK 107 Movies To Have This Common Point

Mega 154 NBK107: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 154’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా, ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అటు మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK107’ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Mega154: డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మెగా 154!

ఈ రెండు సినిమాలపై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతుండగా, ఈ చిత్రాల టైటిల్స్‌ను రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీపావళి కానుకగా ఈ రెండు సినిమాల టైటిల్స్‌ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే మెగా 154 సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్, NBK107 సినిమాకు ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల టైటిల్స్‌లో కామన్ పాయింట్ ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

NBK107: బాలయ్య సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారా.. నెట్టింట ఒకటే మోత!

వాల్తేరు వీరయ్యలో ‘వీర’, వీర సింహా రెడ్డిలో ‘వీర’ ఉండటంతో ఇఫ్పుడు అందరి చూపు ఈ సినిమాల టైటిల్స్‌పై పడింది. మరి నిజంగానే ఈ రెండు సినిమాలకు సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా ఇవే టైటిల్స్ పెడతారా లేక వేరే ఏదైనా టైటిల్స్ అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఒకే కామన్ పాయింట్ ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.