NBK107: బాలయ్య సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారా.. నెట్టింట ఒకటే మోత!

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ఇప్పటికే పలు టైటిల్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

NBK107: బాలయ్య సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారా.. నెట్టింట ఒకటే మోత!

NBK107 Title Leaked In Social Media

NBK107: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాలయ్య విశ్వరూపాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

NBK107: బాలయ్య సినిమా శాటిలైట్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న స్టార్ మా!

ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ వీడియోలు చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ఇప్పటికే పలు టైటిల్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Balakrishna: NBK107 క్రేజీ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు!

ఇక ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యింది. అక్టోబర్ 21న రాత్రి 8.15 గంటలకు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమాకు నిజంగానే ‘వీరసింహా రెడ్డి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలకు వెయిట్ చేయాల్సిందే.