Pathaan : ‘పఠాన్’పై శక్తిమాన్ ఆగ్రహం..

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్న షారుఖ్ చాలా జాగ్రత్తలు తీసుకోని ఈ సినిమాని తెరకెక్కించాడు. బాయ్‌కాట్ ట్రెండ్ మధ్య ఈ చిత్రాన్ని ఎలాగైనా పాజిటివ్‌గా ప్రేక్షకులకు దగ్గర చేదాం అనుకున్న షారుఖ్ చుక్క ఎదురైంది. చివరికి అనుకోని విధంగా పఠాన్ చిక్కుల్లో పడింది.

Pathaan : ‘పఠాన్’పై శక్తిమాన్ ఆగ్రహం..

Mukesh Khanna comments on Pathaan Besharam Rang song

Pathaan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్న షారుఖ్ చాలా జాగ్రత్తలు తీసుకోని ఈ సినిమాని తెరకెక్కించాడు. బాయ్‌కాట్ ట్రెండ్ మధ్య ఈ చిత్రాన్ని ఎలాగైనా పాజిటివ్‌గా ప్రేక్షకులకు దగ్గర చేదాం అనుకున్న షారుఖ్ చుక్క ఎదురైంది. చివరికి అనుకోని విధంగా పఠాన్ చిక్కుల్లో పడింది.

Pathaan: మరో వివాదంలో ‘పఠాన్’ సినిమా.. హిందువులు కాదు, ఈసారి ముస్లింలే బ్యాన్ చేయాలంటున్నారు

ఇటీవల పఠాన్ మూవీ నుంచి ఒక రొమాంటిక్ పాటని విడుదల చేశారు మేకర్స్. ‘బేషరం రంగ్’ అంటూ సాగే ఈ పాటలో అశ్లీలత ఎక్కువ ఉంది అంటూ నెటిజెన్లు మరియు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురుకుంటుంది. సినిమా నుంచి ఈ పాటని తొలిగించాలి అంటూ మహారాష్ట్ర హోంమంత్రి డిమాండ్ చేయగా, తాజాగా ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రముఖ బాలీవుడ్ మరియు టెలివిజన్ నటుడు.

ఇండియన్ సూపర్ హీరో ‘శక్తిమాన్’గా ఇండియా మొత్తం పేరుని సంపాదించుకున్న ‘ముకేశ్ ఖన్నా’ ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘బేషరం రంగ్’ చూడడానికి చాలా అసహ్యంగా ఉందన్న ముకేశ్.. “ఇప్పుడు పొట్టి పొట్టి డ్రెస్‌ల్లో చూపిస్తున్న మేకర్స్, భవిషత్తులో నగ్నంగా చూపించే అవకాశం ఉంది” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మరి ఇంతటి వ్యతిరేకతని తెచ్చిపెడుతున్న ఆ పాటని మేకర్స్ సినిమా నుంచి తొలిగిస్తారా? లేదా? అనేది చూడాలి.