Pathaan: మరో వివాదంలో ‘పఠాన్’ సినిమా.. హిందువులు కాదు, ఈసారి ముస్లింలే బ్యాన్ చేయాలంటున్నారు

వీటిని అధిగమించి సినిమాను ఎలా విడుదల చేయాలని చిత్ర బృందం తలలు పట్టుకుంటే తాజాగా మరో వివాదం సినిమాను కలవరానికి గురి చేస్తోంది. తాజాగా ముస్లిం సంఘాలు సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Pathaan: మరో వివాదంలో ‘పఠాన్’ సినిమా.. హిందువులు కాదు, ఈసారి ముస్లింలే బ్యాన్ చేయాలంటున్నారు

Now Muslim board slams SRK's next for hurting religious sentiments

Pathaan: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ‘పఠాన్’ సినిమా ‘బేషరం రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ పాటలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొన్ని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిని అధిగమించి సినిమాను ఎలా విడుదల చేయాలని చిత్ర బృందం తలలు పట్టుకుంటే తాజాగా మరో వివాదం సినిమాను కలవరానికి గురి చేస్తోంది. తాజాగా ముస్లిం సంఘాలు సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Bihar: తేజశ్వీ యాదవ్‭ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయండి.. నితీశ్ కుమార్‭కు పీకే సలహా

బేషరం రంగ్ పాటపైనే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉలేమా బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. పఠాన్లు చాలా గౌరవంగా ఉంటారని, వారిది అత్యంత గౌరవమైన సమాజమని, అయితే ఈ సినిమాలో వారిని చాలా అభ్యంతకరంగా చూపించారంటూ ఉలేమా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలని, లేని పక్షంలో సినిమాలోని అశ్లీల దృశ్యాలను తెరపై కనిపించకుండా కత్తిరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆల్ ఇండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ బహిష్కరించిందని ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీస్ పేర్కొన్నారు.

Indian-China Clash: పీఎం కేర్స్‭కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు

‘‘ఈ చిత్రాన్ని చూడవద్దని మేము ప్రభుత్వ ప్రజలకు, జవాన్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా ఇస్లాంను తప్పుగా చూపిస్తే, మన మతానికి ఉన్న సరైన నిర్వచనాన్ని వెల్లడించడం మన బాధ్యత. సెన్సార్ బోర్డ్‌కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదని భారతదేశంలోని అన్ని థియేటర్లకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది. శాంతికి భంగం కలిగిస్తుంది. ఈ దేశంలోని ముస్లింలందరి మనోభావాలు దెబ్బతింటాయి. మమ్మల్ని ఎగతాళి చేస్తుంది’’ అని అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీస్ అన్నారు.