800 Movie : ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది..

శ్రీలంక క్రికెటర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న '800' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

800 Movie : ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Muttiah Muralitharan biopic 800 Movie release date

800 Movie : శ్రీలంక క్రికెట్ ఆటగాడు లెజెండ‌రీ ఆఫ్ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవితం ఆధారంగా ‘800’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ముర‌ళీధ‌ర‌న్ పాత్రని స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ ‘మధుర్ మిట్టల్’ చేస్తున్నాడు. మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ న‌టిస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ని క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ రిలీజ్ చేశాడు.

Allu Arjun : జవాన్ పై అల్లు అర్జున్ ట్వీట్.. షారుక్ ఖాన్ మాస్ అవతార్ అంటూ..

ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఆ తేదీని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్‌గా ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ నిలవడంతో ఈ మూవీకి ఆ టైటిల్ ని పెట్టారు.

Harsha Sai : హీరోగా యూట్యూబర్ హర్ష సాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ..

కాగా ఈ మూవీని మొదటిగా విజయ్ సేతుపతితో తెరకెక్కించాలని చూశారు. అయితే విజయ్ ఈ పాత్రని చేయకూడదని కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ సినిమా ఆల్ఇండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ద‌క్కించుకున్నారు.