Harsha Sai : హీరోగా యూట్యూబర్ హర్ష సాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ..

యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హర్ష ఇప్పుడు..

Harsha Sai : హీరోగా యూట్యూబర్ హర్ష సాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ..

Harsha Sai movie under bigboss fame Mitraaw Sharma production

Updated On : September 14, 2023 / 10:28 AM IST

Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కష్టం అన్న వారికీ, కష్టంలో ఉన్న వారికీ సహాయం చేస్తూ, దానిని వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టి లక్షలు సంపాదిస్తుంటాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక యూట్యూబర్ ఇంతటి ఫేమ్ ని సంపాదించుకున్న హర్ష సాయి.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. షూటింగ్ కంటిన్యూ..

ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ఈ నెల 17న ఉదయం 10 గంటలకు జరుగుతుంది అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఒక పెద్ద గంట చుట్టూ చాలామంది జనంతో ఇంటరెస్టింగ్ గా ఉంది. కాగా ఈ సినిమాని బిగ్‌బాస్ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్ పతాకం పై నిర్మిస్తుంది. ఇక చిత్రానికి సమర్పుకులుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దగ్గర బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు వ్యవహరిస్తుండడం విశేషం.

Mahesh Babu : మహేష్ బాబు ఫ్యామిలీ.. స్కాట్లాండ్ అడ్వెంచర్స్.. వీడియో వైరల్!

అంతేకాదు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కించబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనే దాని ఆసక్తి నెలకుంది. ఇన్నాళ్లు యూట్యూబ్ లో అలరిస్తూ వచ్చిన హర్ష సాయి.. ఇప్పుడు వెండితెర పై ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతుంది.