Mahesh Babu : మహేష్ బాబు ఫ్యామిలీ.. స్కాట్లాండ్ అడ్వెంచర్స్.. వీడియో వైరల్!
మహేష్ బాబు ఫ్యామిలీ స్కాట్లాండ్ అడ్వెంచర్స్ డైరీస్. వీడియో చూశారా..?

Mahesh Babu family Scotland holiday vacation video gone viral
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిపోతుంటుంటాడు. ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి అక్కడ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా ఇటీవల ఫ్యామిలీతో కలిసి స్కాట్లాండ్ వెళ్ళాడు. ఇక అక్కడ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నమ్రతా, సితార తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
Vishal : ఆ దర్శకుడితో కలిసి అసలు పని చేయను..
ఆ వీడియోలో సితార, గౌతమ్, నమ్రత, మహేష్.. పలు గేమ్స్ ఆడుతూ కనిపించారు. ముందుగా గ్రౌండ్ లో గోల్ఫ్ ఆడుతూ కనిపించిన మహేష్ ఫ్యామిలీ.. ఆ తరువాత గన్ షూటింగ్ తో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబుని మీరుకూడా ఒకసారి చూసేయండి.
View this post on Instagram
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పక్కా మాస్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు మునుపెన్నడూ కనబడనంత మాస్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మహేష్ లుక్స్ అన్ని అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Chandramukhi 2 : చంద్రముఖి నుంచి ‘థోరి బోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్..
శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు మూవీ టీం తెగ కష్టపడుతుంది. ఈక్రమంలోనే షూటింగ్ ని వేగవంతం చేశారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వినాయక చవితి పండక్కి ఏమన్నా అప్డేట్ ఇస్తారా..? లేదా అనేది చూడాలి.