The Ghost: ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన ‘ది ఘోస్ట్’!

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

The Ghost: ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన ‘ది ఘోస్ట్’!

Nagarjuna The Ghost Pre-Release Event Date And Venue Locked

The Ghost: కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

The Ghost Movie: ‘వేగం’గా దూసుకొస్తున్న ది ఘోస్ట్ రొమాంటిక్ సాంగ్!

కాగా, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ ప్రీరిలీజ్ వేడుకను సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్‌టిబిసి గ్రౌండ్‌లో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఈ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు.

The Ghost Movie: ఆరు నూరైనా.. అదే రోజు దిగుతానంటోన్న ‘ది ఘోస్ట్’!

ఈ ప్రీరిలీజ్ వేడుకలో ది ఘోస్ట్ చిత్రానికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలను వెల్లడిస్తారా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని, ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎవరు వస్తారా అనేది చూడాలి.