Hit2 Teaser: హిట్2 టీజర్ పై నాని అప్డేట్.. ఏమన్నాడంటే?

యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా టీజర్ గురించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది.

Hit2 Teaser: హిట్2 టీజర్ పై నాని అప్డేట్.. ఏమన్నాడంటే?

Nani Gives Update On Hit2 Teaser

Hit2 Teaser: యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తొలిభాగంలో హీరో విశ్వక్ సేన్ నటించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న హిట్-2 మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

HIT The Second Case: కేసు పరిష్కరించి నానికి రెండో “హిట్” ఇస్తానంటున్న అడివి శేషు.. హిట్-2 అప్‌డేట్ వచ్చేసింది!

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా టీజర్ గురించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న హీరో నాని, త్వరలోనే హిట్ 2 టీజర్ రానుందని పేర్కొన్నాడు. అటు హీరో అడివి శేష్, హిట్ 2 టీజర్ రఫ్‌కట్ వీక్షించానని.. ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపిస్తానని పేర్కొన్నాడు. దీంతో హిట్-2 సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.

Adivi Sesh: ‘హిట్-2’పై అడివి శేష్ సాలిడ్ అప్‌డేట్

ఇక ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో మీనాక్షి చైదరి, భానుచందర్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.