HIT The Second Case: కేసు పరిష్కరించి నానికి రెండో “హిట్” ఇస్తానంటున్న అడివి శేషు.. హిట్-2 అప్‌డేట్ వచ్చేసింది!
నేచురల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్షకుల చేత మంచి నటుడు అనిపించుకోవడమే కాకుండా ప్రతిభ ఉన్నవాడిని ప్రోత్సహిస్తూ మంచి మనిషి కూడా అనిపించుకుంటున్నాడు. "వాల్ పోస్టర్ సినిమా" అంటూ ఒక నిర్మాణ సంస్థని స్థాపించి, కొత్త దర్శకులకు అవకాశం కలిపిస్తున్నాడు. గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన "హిట్ ది ఫస్ట్ కేస్" మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ అప్పుడే సీక్వెల్ ఉండనట్లు చెప్పుకొచ్చిన మూవీ మేకర్స్..

HIT The Second Case Release Date Announced
HIT The Second Case: నేచురల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్షకుల చేత మంచి నటుడు అనిపించుకోవడమే కాకుండా ప్రతిభ ఉన్నవాడిని ప్రోత్సహిస్తూ మంచి మనిషి కూడా అనిపించుకుంటున్నాడు. “వాల్ పోస్టర్ సినిమా” అంటూ ఒక నిర్మాణ సంస్థని స్థాపించి, కొత్త దర్శకులకు అవకాశం కలిపిస్తున్నాడు. ఆ క్రమంలోనే ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి దర్శకులతో సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నాడు.
Adivi Sesh: ‘హిట్-2’పై అడివి శేష్ సాలిడ్ అప్‌డేట్
గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన “హిట్ ది ఫస్ట్ కేస్” మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ అప్పుడే సీక్వెల్ ఉండనట్లు చెప్పుకొచ్చిన మూవీ మేకర్స్.. “హిట్ ది సెకండ్ కేస్” చిత్రీకరణ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా రాబోతున్నట్టు నేడు ఒక పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
హిట్-1 లో విశ్వక్ సేన్ లీడ్ రోల్ చేయగా, హిట్-2 లో అడవి శేషు కథానాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అడవి శేషు నటించిన మూవీస్ అంటే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, పైగా ఒక హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక హిట్-1 తెరకెక్కించిన శైలేష్ కోలనే ఈ సినిమాకు కూడా కథని అందిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు.
2nd case on 2nd December ?
KD @adivisesh on ?#HIT2onDEC2 @KolanuSailesh @PrashantiTipirn #MeenakshiChaudhary @maniDop #JohnStewartEduri @SVR4446 @walpostercinema pic.twitter.com/yhNltECCds
— Nani (@NameisNani) September 15, 2022