Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు..
షారుఖ్ ఖాన్ వంటి స్టార్ నటించిన 'జవాన్' మూవీతో పాటు రిలీజ్ అయిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా' సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు.
![Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు.. Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు..](https://10tv.in/wp-content/uploads/2023/09/Naveen-Polishetty-Anushka-Shetty-Miss-Shetty-Mr-Polishetty-collections.jpg)
Naveen Polishetty Anushka Shetty Miss Shetty Mr Polishetty collections
Miss Shetty Mr Polishetty : నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క శెట్టి (Anushka Shetty) చెఫ్‌గా నటిస్తూ ఆడియన్స్ తీసుకు వచ్చిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీని కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. సకుటుంబ ప్రేక్షకులని ఆకట్టుకుని బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
Jawan : ఆ రికార్డు సాధించిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్.. జవాన్ మూవీ..
ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తి అయినా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ లో మంచి వసూళ్లు రాబడుతుంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. షారుఖ్ ఖాన్ వంటి స్టార్ నటించిన ‘జవాన్’ మూవీతో పాటు రిలీజ్ అయ్యి, దాని తాకిడిని తట్టుకొని ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం మాములు విషయం కాదు.
నవీన్ పోలిశెట్టి లాస్ట్ మూవీ ‘జాతిరత్నాలు’ కూడా యాభై కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఈ మార్క్ ని అందుకోవడంతో.. నవీన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కాగా ఈ మూవీ యూఎస్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. నవీన్ పోలిశెట్టికి ఇది రెండో మిలియన్ మార్క్ మూవీ.
Muralitharan : వెంకటేష్, నాని గురించి క్రికెటర్ మురళీధరన్ కామెంట్స్.. ఎన్టీఆర్ ప్రభాస్‌ని కూడా..
అయితే ఈ సినిమా కేవలం ఒక మిలియన్ దగ్గరే ఆగిపోకుండా.. 2M మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలోనే ఉంటూ.. అక్కడ సందడి చేస్తున్నాడు. ఏదేమైనా ఈ మూవీ నవీన్ పోలిశెట్టికి రికార్డులు తెచ్చిపెడుతుంది. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్టుని అందుకున్నాడు.
Crossing milestones with every laugh! 💥#MissShettyMrPolishetty has crossed the magnificent 5️⃣0️⃣+ Crores at the box office 😎
Thanks to the lovely audience for adding another reMARKable blockbuster to our journey 🤗
𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐞𝐫 𝐎𝐟 𝐓𝐡𝐞 𝐘𝐞𝐚𝐫… pic.twitter.com/KrdSbCSaG2
— UV Creations (@UV_Creations) September 25, 2023