Jawan : ఆ రికార్డు సాధించిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్.. జవాన్ మూవీ..

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో సరికొత్త రికార్డుని సృష్టించాడు. ఇప్పటివరకు ప్రభాస్, యశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్..

Jawan : ఆ రికార్డు సాధించిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్.. జవాన్ మూవీ..

Shah Rukh Khan rare record with Jawan movie collections

Jawan Collections : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘పఠాన్’ సినిమాతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. పఠాన్ తో 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని, 500 కోట్ల షేర్ ని అందుకొని షారుఖ్ కి మాత్రమే కాదు బాలీవుడ్ కి కూడా మంచి హుషారుని తెచ్చింది. ఇక ఈ మూవీ తరువాత షారుఖ్ నుంచి వచ్చిన మరో సినిమా ‘జవాన్’ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.

Dil Raju : కిరణ్ అబ్బవరం ఫస్ట్ సినిమా డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు..

మొదటి వీకెండ్ లోనే 400 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ మూవీ.. 10 రోజుల్లో దాదాపు 800 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మూడు వారాలు పూర్తి అయ్యేపాటికి ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. తాజాగా ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంది అంటూ డైరెక్టర్ అట్లీ తెలియజేశాడు. ఈ సినిమా రూ.1004.92 కోట్ల కలెక్షన్స్ ని అందుకుందని తెలియజేశాడు. ఇక ఈ మార్క్ ని అందుకోవడంతో షారుఖ్ ఖాన్ కొత్త రికార్డుని సాధించినట్లు అయ్యింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి..?

Muralitharan : వెంకటేష్, నాని గురించి క్రికెటర్ మురళీధరన్ కామెంట్స్.. ఎన్టీఆర్ ప్రభాస్‌ని కూడా..

ఇప్పటివరకు ప్రభాస్, యశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వెయ్య కోట్లు మార్క్ ని అందుకున్నారు. అయితే వీరందరికి వెయ్యి కోట్ల క్లబ్ లో ఒక సినిమా మాత్రమే ఉంది. షారుఖ్ ఇప్పుడు జవాన్ తో కూడా ఆ మార్క్ ని రెండోసారి అందుకొని.. రెండు వెయ్యి కోట్ల మూవీస్ ఉన్న హీరోగా రికార్డు సృష్టించాడు. దీంతో షారుఖ్ అభిమానులు తమ హీరో భారీ కమ్‌బ్యాక్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది షారుఖ్ నుంచి మరో మూవీ కూడా రాబోతుంది. ‘డంకీ’ సినిమాతో కూడా 1000 కోట్ల మార్క్ ని అందుకుంటే.. ఒకే ఇయర్ లో మూడు సినిమాలతో వెయ్యి కోట్లు అందుకున్న హీరోగా సరికొత్త రికార్డుని సృష్టిస్తాడు.

 

View this post on Instagram

 

A post shared by Atlee (@atlee47)