Dil Raju : కిరణ్ అబ్బవరం ఫస్ట్ సినిమా డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు..
కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ లతో కలిసి సినిమాలు చేసిన డైరెక్టర్ అండ్ రైటర్ రవికిరణ్ కోలా..

Ravi Kiran Kola second movie in Dil Raju Production
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒక పక్క స్టార్ హీరోలు దర్శకులతో సినిమాలు చేస్తూనే, మరోపక్క చిన్న హీరోలు, దర్శకులను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల జబర్దస్త్ వేణుకి అవకాశం ఇచ్చి ‘బలగం’ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కి కూడా అవకాశం ఇచ్చాడు. టాలీవుడ్ యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’ని ఆడియన్స్ కి పరిచయం చేసిన సినిమా ‘రాజావారు రాణిగారు’. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.
Muralitharan : వెంకటేష్, నాని గురించి క్రికెటర్ మురళీధరన్ కామెంట్స్.. ఎన్టీఆర్ ప్రభాస్‌ని కూడా..
ఈ సినిమాని ‘రవికిరణ్ కోలా’ డైరెక్ట్ చేశాడు. ఆ మూవీ తరువాత మల్లి మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు. అయితే ఈమధ్య విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాకి రవికిరణ్ కోలానే కథని అందించాడు. ఈ మూవీలోని స్టోరీ, మాటలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక రవికిరణ్ లోని టాలెంట్ ని గుర్తించిన దిల్ రాజు ఇప్పుడు అతడికి దర్శకుడిగా రెండో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు.
Kannappa : హీరోయిన్ లేకుండా ‘కన్నప్ప’ షూటింగ్ స్టార్ట్.. మూవీలో మరో సూపర్ స్టార్..!
ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామంటూ ప్రకటించారు. మరి ఈ ప్రాజెక్ట్ లోకి ఏ హీరో ఎంట్రీ ఇస్తాడో చూడాలి. అలాగే రవికిరణ్ డైరెక్ట్ చేసిన మూవీ, స్టోరీ అందించిన మూవీ.. రెండు లవ్ స్టోరీస్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మరి ఈసారి కూడా లవ్ స్టోరీతోనే వస్తాడా..? లేదా మరో కథతో వస్తాడా..? అనేది చూడాలి.
View this post on Instagram