Nithin : ఇండియాలో ఎక్కువ ఫ్లాప్ సినిమాలు ఏ హీరోకి ఉన్నాయి అని వెతికేవాడిని.. లవ్ సినిమాలు చేసి బోర్ కొట్టింది..

నితిన్ తన ఫ్లాప్స్ గురించి మాట్లాడుతూ.. ''నా ఇరవై ఏళ్ల సినీ ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాను. ఇంకా హార్డ్ వర్క్ చేసి...........

Nithin : ఇండియాలో ఎక్కువ ఫ్లాప్ సినిమాలు ఏ హీరోకి ఉన్నాయి అని వెతికేవాడిని.. లవ్ సినిమాలు చేసి బోర్ కొట్టింది..

nithin

Nithin :  లవర్ బాయ్ నితిన్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్నాడు. త్వరలో మాచర్ల నియోజకవర్గం సినిమాతో రాబోతున్నాడు. కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని ఆగస్టు 12న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు నితిన్.

ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ చూసాడు నితిన్. చాలా సంవత్సరాలకి ఇష్క్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. నితిన్ తన ఫ్లాప్స్ గురించి మాట్లాడుతూ.. ”నా ఇరవై ఏళ్ల సినీ ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాను. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలి. నాకు వరుస ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన హీరోలు ఎవరు అని గూగల్ లో వెతికేవాడిని. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. కానీ వాళ్ళు ఇప్పుడు ఫుల్ సక్సెస్ లో ఉండి స్టార్ హీరోలుగా ఉన్నారు. అప్పుడు వాళ్లని చూసి స్ఫూర్తి తెచ్చుకునేవాడ్ని. వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. మొదట బాధపడినా, తర్వాత పాజిటివ్ గానే తీసుకున్నాను.”

Nayanthara: నయనతార పెళ్లి టీజర్.. అంతకుమించి అంటోన్న ఫ్యాన్స్!

”ఇన్ని రోజులు లవ్ స్టోరీలు చేసి బోర్ కొట్టింది. మొదటిసారి పూర్తి మాస్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేస్తున్నాను. ‘మాచర్ల నియోజకవర్గం’ ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. చాలా పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కమర్షియల్ సినిమా అయినా కథ చాలా యూనిక్‌గా వుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇది కొత్తగా ఉంటుంది. మొదటిసారి ఐఏఎస్ పాత్ర చేస్తున్నాను” అని తెలిపారు.