NTR: కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తులు.. మరీ ఇంత మార్పా?

"అప్పుడప్పుడు ధైర్యానికి తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని" అనే ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రకటించిన ఎన్టీఆర్, కొరటాల సినిమా అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ సంపాధించుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం తారక్ భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

NTR: కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తులు.. మరీ ఇంత మార్పా?

NTR Makeover for Koratala Siva Movie

NTR: “అప్పుడప్పుడు ధైర్యానికి తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని” అనే ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రకటించిన ఎన్టీఆర్, కొరటాల సినిమా అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ సంపాధించుకుంది. RRRతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

NTR30: ఎన్టీఆర్ సినిమాలో అలనాటి లేడీ సూపర్ స్టార్..?

గతంలో తారక్ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన “జనతా గ్యారేజ్” అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం తారక్ భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కేంద్రమంత్రి ‘అమిత్ షా’ని కలిసిన ఎన్టీఆర్, ఆ సమయంలో కొంత లావుగా కనిపించాడు. ఆ తరువాత ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనబడగా కొంచెం లావు తగ్గి స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఆ తరవాత కూడా ఇంకా సన్నబడుతున్నట్టు తెలుస్తుంది. పాత్రకు తగ్గట్టు బాడీ ఉండాలని కొరటాల కోరగా ఎన్టీఆర్ ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. RRR సమయంలో కూడా తారక్ ఆ పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మలుచుకున్న విషయం తెలిసిందే.