NTR30: ఎన్టీఆర్ సినిమాలో అలనాటి లేడీ సూపర్ స్టార్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌లతో వరుసగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తన పుట్టినరోజున ఈ సినిమాల గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు తారక్. ఎన్టీఆర్ 30వ చిత్రంలో అలనాటి ఓ లేడీ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

NTR30: ఎన్టీఆర్ సినిమాలో అలనాటి లేడీ సూపర్ స్టార్..?

NTR 30 To Have Lady Super Star Of Yesteryear

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌లతో వరుసగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తన పుట్టినరోజున ఈ సినిమాల గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు తారక్. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ తరువాత తారక్ చేయబోయే సినిమాలు ఎలాంటి కథలతో వస్తాయా, ఈ సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

NTR30: ఎన్టీఆర్ సినిమాకు ఆ బ్యూటీ నో చెప్పిందా..?

అయితే తారక్ తన నెక్ట్స్ చిత్రాలను అనౌన్స్ చేసిన రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ సినిమాలు పట్టాలెక్కలేదు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయిన తారక్, ఈ సినిమాలో అల్ట్రా పవర్‌ఫుల్ రోల్‌లో నటించబోతున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌లో చూపించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

NTR30 Movie: మరింత ఆలస్యంగా ఎన్టీఆర్-కొరటాల మూవీ.. ఎందుకంటే?

ఎన్టీఆర్ 30వ చిత్రంలో అలనాటి ఓ లేడీ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. విజయశాంతి అని తెలుస్తోంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన విజయశాంతి.. తన పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు తారక్ చేయబోయే సినిమాలో కూడా అలాంటి పవర్‌ఫుల్ పాత్ర ఒకటి ఉందని.. ఈ పాత్రలో నటించేందుకు విజయశాంతిని కొరటాల అండ్ టీమ్ సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ విజయశాంతి నిజంగా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తే మాత్రం.. రెండు పవర్ హౌజ్‌లను ఒకే తెరపై చూసే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.