NTR30: ఎన్టీఆర్ సినిమాకు ఆ బ్యూటీ నో చెప్పిందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను తారక్ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించనుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో కొరటాల సతమతమవుతున్నాడట.

NTR30: ఎన్టీఆర్ సినిమాకు ఆ బ్యూటీ నో చెప్పిందా..?

Star Heroine Says No To NTR30 Movie

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను తారక్ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించనుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

NTR30 Movie: మరింత ఆలస్యంగా ఎన్టీఆర్-కొరటాల మూవీ.. ఎందుకంటే?

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ఈ సినిమా స్క్రిప్టు విషయంలో కొరటాల చాలా సమయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో నటీనటుల ఎంపికలోనూ కొరటాల ఇబ్బందులు పడుతున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో కొరటాల సతమతమవుతున్నాడట.

NTR30: సముద్రంలో తారక్ చితక్కొట్టుడు.. మామూలుగా ఉండదట!

ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. కానీ అదంతా కేవలం ట్రాష్ అని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని కొరటాల ఆమెను సంప్రదించాడట. కానీ, సమంత కొరటాలకు దిమ్మతిరిగే షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం అమ్మడు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కొరటాల ఆలోచనలో పడిపోయాడట. తాను ఈ సినిమాలో హీరోయిన్ కోసం రూ.2.5 కోట్ల బడ్జెట్ వేసుకున్నట్లుగా కొరటాల చెప్పినా.. సామ్ మాత్రం తనకు రూ.4 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టిందట. దీంతో ఈ సినిమా డీల్ కుదరకపోవడంతో సామ్ ఈ చిత్రానికి నో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాను సామ్ రిజెక్ట్ చేసిందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.