NTR30: సముద్రంలో తారక్ చితక్కొట్టుడు.. మామూలుగా ఉండదట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఆయన తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. తారక్ నెక్ట్స్ మూవీగా వస్తున్న NTR30 ప్రాజెక్టును కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ మూవీగా తీసుకున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తుండగా, ఇందులో సముద్రంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

NTR30: సముద్రంలో తారక్ చితక్కొట్టుడు.. మామూలుగా ఉండదట!

NTR30 To Have A Huge Sea Fight Sequence

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఆయన తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. దీంతో తారక్, తన నెక్ట్స్ మూవీని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

NTR30: అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం.. అసలు విషయం బట్టబయలు చేసిన కళ్యాణ్ రామ్!

అయితే తారక్ నెక్ట్స్ మూవీగా వస్తున్న NTR30 ప్రాజెక్టును కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ మూవీగా తీసుకున్నాడు. ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం గురించి వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తుండగా, ఇందులో సముద్రంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

NTR30: ఆగస్టు కూడా ఆగాల్సిందే అంటోన్న కొరటాల..?

ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో తారక్ యాక్షన్ సీన్స్ ఔట్‌స్టాండింగ్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో తారక్ మరోసారి స్లిమ్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే తారక్ 8-9 కిలోల బరువు తగ్గాడు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.