NTR30: అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం.. అసలు విషయం బట్టబయలు చేసిన కళ్యాణ్ రామ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. ఈ విషయంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

NTR30: అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం.. అసలు విషయం బట్టబయలు చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram Tells Why Ntr30 Getting Delayed

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను తొలుత జూలైలోనే రెగ్యులర్ షూటింగ్‌కు తీసుకెళ్లాలని తారక్ అండ్ టీమ్ భావించారు. కానీ జూలైలో ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. ఇంతకీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు ఏ అంశం అడ్డుపడుతుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

NTR30: ఆగస్టు కూడా ఆగాల్సిందే అంటోన్న కొరటాల..?

కాగా.. తాజాగా ఈ విషయంపై హీరో కమ్ నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ వివరణ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసారా’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఏదో చేశామా అన్నట్లుగా కాకుండా ప్రతి విషయంలోనూ చాలా కేరింగ్‌గా ఉండటంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు ఆలస్యం అవుతోందని కళ్యాణ్ రామ్ తెలిపారు.

NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!

ఇక ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాకుండా యూనివర్సల్ ఆడియెన్స్ కోసం రెడీ చేస్తున్నట్లుగా, భారీ బడ్జెత్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎవరి ఊహలకు అందని విధంగా రూపొందించనున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు. కాగా ఈ సినిమా కోసం తారక్ మరోసారి బరువును తగ్గించే పనిలో ఇప్పటికే నిమగ్నమైపోయాడు. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుందనే విషయంపై మాత్రం కళ్యాణ్ రామ్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు మళ్లీ అయోమయంలో పడిపోయారు.