NTR30: ఆగస్టు కూడా ఆగాల్సిందే అంటోన్న కొరటాల..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఓకే చేసిన సంగతి తెలిసిందే. తారక్ 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు.....

NTR30: ఆగస్టు కూడా ఆగాల్సిందే అంటోన్న కొరటాల..?

Ntr30 Movie To Get More Delayed

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఓకే చేసిన సంగతి తెలిసిందే. తారక్ 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు.

NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!

అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలైలోనే స్టార్ట్ చేయాల్సి ఉన్నా, తారక్ మరోసారి తన ఫిజిక్‌ను మార్చే పనిలో ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమా ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు అది కుదిరేలా లేదట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరింత లేట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు ఫైనల్ డ్రాఫ్ట్‌ను ఇంకా లాక్ చేయాల్సి ఉండటంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు మరింత సమయం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో కాకుండా సెప్టెంబర్ నెలలో మొదలవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.