NTR30 Movie: మరింత ఆలస్యంగా ఎన్టీఆర్-కొరటాల మూవీ.. ఎందుకంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన పుట్టినరోజున ఈ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో చేయబోయే సినిమా రానుండగా, 31వ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమా రానుంది. అయితే ఈ సినిమాలను అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతోంది. కానీ.. ఇప్పటివరకు తారక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు.

NTR30 Movie: మరింత ఆలస్యంగా ఎన్టీఆర్-కొరటాల మూవీ.. ఎందుకంటే?

NTR 30 Movie To Get More Late

NTR30 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన పుట్టినరోజున ఈ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో చేయబోయే సినిమా రానుండగా, 31వ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమా రానుంది. అయితే ఈ సినిమాలను అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతోంది.

NTR30: సముద్రంలో తారక్ చితక్కొట్టుడు.. మామూలుగా ఉండదట!

కానీ.. ఇప్పటివరకు తారక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. దీంతో నందమూరి అభిమానులు తారక్ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తారక్ 30వ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కూడా ఉందట. దర్శకుడు కొరటాల శివ ఇంకా ఫైనల్ స్క్రిప్టును రెడీ చేయలేని కారణంగానే ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోందని తెలుస్తోంది.

NTR30: అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం.. అసలు విషయం బట్టబయలు చేసిన కళ్యాణ్ రామ్!

ఆచార్య ఫెయిల్యూర్ నుండి బయటపడాలని గట్టిగా చూస్తున్న కొరటాల శివ, ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాడట. అందుకే తారక్‌తో సినిమాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేలా చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫైనల్ స్క్రిప్టును ఓకే చేయడానికి సమయం పడుతుందని.. ఒక్కసారి స్క్రిప్టు ఫైనల్ అయ్యాక, రెగ్యులర్ షూటింగ్ నిర్విరామంగా జరపడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి సెప్టెంబర్ నెలలో అయినా తారక్ 30వ చిత్రం పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.