NTR : చేపలు అమ్ముతున్న జూనియర్ ఎన్టీఆర్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేపలు అమ్మడానికి సిద్దమయ్యాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ చాలా రోజులు గ్యాప్ తరువాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు. అయితే ఇది తన కొత్త సినిమా షూటింగ్ కాదండోయ్.. ఒక కమర్షియల్ యాడ్ కోసం ఒక కొత్త మేక్ ఓవర్ తో కనిపించాడు.

NTR : చేపలు అమ్ముతున్న జూనియర్ ఎన్టీఆర్..

NTR New Commercial Ad

Updated On : November 23, 2022 / 12:13 PM IST

NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేపలు అమ్మడానికి సిద్దమయ్యాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ చాలా రోజులు గ్యాప్ తరువాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు. అయితే ఇది తన కొత్త సినిమా షూటింగ్ కాదండోయ్.. ఒక కమర్షియల్ యాడ్ కోసం ఒక కొత్త మేక్ ఓవర్ తో కనిపించాడు.

NTR 30 : బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ కోసం దాచుకున్న టైటిల్ ఎన్టీఆర్ సినిమాకి వాడేస్తున్నారా? NTR 30 టైటిల్ అదేనా??

‘లిసియస్’ అనే నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ కంపెనీ కోసం ఎన్టీఆర్ ఈ యాడ్ చేశాడు. ఈ యాడ్ లో తారక్ తో పాటు రాహుల్ రామకృష్ణ కూడా నటించాడు. ఇక ఈ యాడ్ ని జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. అయితే ఈ యాడ్.. అన్ని కమర్షియల్ యాడ్స్ లా కాకుండా, కొత్తగా ఉండడంతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కాగా NTR30 ప్రీ ప్రోడుక్షన్ వర్క్స్ శర వేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ ని కూడా స్టార్ట్ చేసినట్లు అనిరుధ్ వెల్లడించాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించడానికి సిద్దమవుతున్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)