NTR 30 : బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ కోసం దాచుకున్న టైటిల్ ఎన్టీఆర్ సినిమాకి వాడేస్తున్నారా? NTR 30 టైటిల్ అదేనా??

ఈ టైటిల్ ని గతంలో రిజిస్టర్ కూడా చేయించాడు. ఈ టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని బండ్ల గణేష్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ టైటిల్ ఎన్టీఆర్ వాడేస్తున్నారట. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న NTR 30 సినిమాకి.............

NTR 30 : బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ కోసం దాచుకున్న టైటిల్ ఎన్టీఆర్ సినిమాకి వాడేస్తున్నారా? NTR 30 టైటిల్ అదేనా??

Bandla ganesh title will using for NTR 30 movie

Updated On : November 12, 2022 / 1:39 PM IST

NTR 30 :  బండ్ల గణేష్ కి పవన్ మీదున్న అభిమానం ఎలాంటిదో అందరికి తెలిసిందే. స్టేజ్ ఎక్కితే పవన్ గురించి చెప్తూ రెచ్చిపోతాడు బండ్లన్న. ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి పోస్టులు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ని బండ్లన్న అప్పుడప్పుడు ‘దేవర’ అని పిలుస్తూ ఉంటారు. చాలా సార్లు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి ఈ పేరుని సంభోదించాడు బండ్ల గణేష్.

ఈ టైటిల్ ని గతంలో రిజిస్టర్ కూడా చేయించాడు. ఈ టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని బండ్ల గణేష్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ టైటిల్ ఎన్టీఆర్ వాడేస్తున్నారట. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న NTR 30 సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు, షూటింగ్ కూడా మొదలవ్వలేదు. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానులకి మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఇచ్చిన మోషన్ పోస్టర్ తో ఇది పక్కా మాస్ సినిమాలా ఉండబోతుంది అని భావించారు..

Samantha : యశోద ఫస్ట్ డే కలెక్షన్స్.. పర్వాలేదనిపించిన సమంత.. బ్రేక్ ఈవెన్ అవుతుందా??

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో NTR 30 సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. బండ్ల గణేష్ గతంలో టైటిల్ రిజిస్టర్ చేయించినా దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేయించలేదని సమాచారం. దీంతో ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి దేవర టైటిల్ వాడేస్తున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ నిజంగా దేవర టైటిల్ ఎన్టీఆర్ వాడితే పవన్ అభిమానులు, ముఖ్యంగా బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.