Pawan Kalyan Fans: పవన్ బర్త్‌డే స్పెషల్ షోస్.. థియేటర్లను ధ్వంసం చేసిన అభిమానులు

నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో గత వారం రోజులుగా పవనోత్సవం అంటూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ సూపర్ హిట్ సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల స్పెషల్ షోలు వేస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూల్ శ్రీరామ థియేటర్‌లో స్పెషల్ షోలు ప్రదర్శించగా...

Pawan Kalyan Fans: పవన్ బర్త్‌డే స్పెషల్ షోస్.. థియేటర్లను ధ్వంసం చేసిన అభిమానులు

Pawan Kalyan fans destroyed the theatres

Pawan Kalyan Fans: నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో గత వారం రోజులుగా పవనోత్సవం అంటూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ సూపర్ హిట్ సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల స్పెషల్ షోలు వేస్తున్నారు. కాగా ఈ బుధవారం పవన్ తమ్ముడు మూవీని స్పెషల్ షోలు వేసి అభిమానులు సందడి చేశారు.

Naga babu: వీరు అతి వాగుడు రోగంతో బాధ‌ప‌డుతున్నారు: నాగబాబు

అలాగే పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ థండర్ జల్సా మూవీని గురువారం స్పెషల్ షోలు వేశారు. ఈ సందర్భంగా కర్నూల్ శ్రీరామ థియేటర్‌లో స్పెషల్ షోలు ప్రదర్శించగా థియేటర్‌ సౌండ్‌ సిస్టం సరిగా లేదని అభిమానులు ఆందోళనకు దిగి థియేటర్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇదే తరహాలో వైజాగ్ లీలామహల్ థియేటర్ ని కూడా పవన్ అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో థియేటర్ యజమానునికి రూ. 6లక్షల వరకు నష్టం కలిగినట్టు చెబుతున్నారు.

Hari Hara Veera Mallu: పవర్ గ్లాన్స్‌కు టైం ఫిక్స్ చేసిన వీరమల్లు.. ఎప్పుడంటే?

ఇలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుండి ఓ ‘పవర్ గ్లాన్స్’ టీజర్‌ను పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం విడుదల చేసింది. ఇక సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవన్ కి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.